హైదరాబాద్, మే 14: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 13న నిర్వహించిన పాలిసెట్ 2025 పరీక్ష విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 98,858 మంది హాజరయ్యారని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. బాలుర హాజరు శాతం 92.84% కాగా, బాలికల హాజరు శాతం 92.4%గా ఉందన్నారు. ఈ పరీక్ష ఫలితాలు మే 25న విడుదల కానున్నట్లు వెల్లడించారు.
SWAYAM-2025 హాల్‌టికెట్లు విడుదల – మే 17 నుంచి పరీక్షలు
SWAYAM (Study Webs of Active Learning for Young Aspiring Minds) జనవరి సెమిస్టర్ 2025 పరీక్షల హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేది ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్వయమ్ పరీక్షలు మే 17, 18, 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడనున్నాయి.