తమన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల 2’ ఓటీటీపై విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మే 9 (గురువారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, కథను సంపత్ నంది అందించారు. ఇది ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది.
కథా నేపథ్యం ఓదెల అనే గ్రామం. గ్రామంలో తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహా) అనే వ్యక్తి, తన భార్య రాథ (హెబ్బా పటేల్) చేతిలో హత్యకు గురై, ప్రేతాత్మగా మారతాడు. అతని ఆత్మ ఊరిలోని ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా నవ వధువులను లక్ష్యంగా చేసుకుని, అత్యాచారం చేసి హత్యలు చేస్తూ గ్రామాన్ని భయాందోళనకు గురిచేస్తాడు.
ఈ దుష్టశక్తిని అరికట్టేందుకు నాగ సాధువు బైరవి (తమన్నా) ఓదెలకు వస్తుంది. బైరవి మరియు తిరుపతి ప్రేతాత్మ మధ్య జరిగిన పాఠాలు, పోరాటం, చివరకు ఊరిని కాపాడగలిగిందా లేదా అన్నదే ఈ చిత్ర కథాంశం.