test Updates

మెగాస్టార్ చిరంజీవి #Mega157 ముస్సూరీ షెడ్యూల్ పూర్తి

చిరంజీవి #Mega157 ముస్సూరీ షెడ్యూల్ పూర్తి – సంక్రాంతి 2026కి రిలీజ్ సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #Mega157 చిత్ర యూనిట్ ముస్సూరీ వద్ద రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా షూటింగ్‌ ప్రకృతి సోయగాలతో ముస్తాబైన ముస్సూరీ లో హై ఎనర్జీ సన్నివేశాలతో సాగింది.

ఈ విషయాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది:
"షూటింగ్ సెట్స్ పై మేము మజా, మేజిక్ రెండూ కలిపాం. ముస్సూరీ షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. చిరంజీవి హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను థియేటర్లలో పేలుస్తుంది. సంక్రాంతి 2026కి రెడీ అవ్వండి!" అంటూ పోస్ట్ చేసింది.

దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ, "ముస్సూరీ షెడ్యూల్ పూర్తైంది. సంక్రాంతికి సందడి ఉండబోతుంది. తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాం." అన్నారు. ఈ షెడ్యూల్‌కి పదిరోజుల ప్లాన్ ఉండగా, చిత్రబృందం ఖచ్చితంగా షెడ్యూల్‌కు కట్టుబడి పనిచేసిందట.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహూ గారపాటి, సుశ్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార మరోసారి చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేయడం విశేషం. ఇప్పటికే సైరా, గాడ్‌ఫాదర్ సినిమాల్లో ఈ జోడీ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్‌, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. కథను ఎస్ కృష్ణ మరియు జి.ఆది నారాయణ కలిసి అందించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2026 సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book