రూ.1600 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా 'రామాయణం' – రణ్‌బీర్ రామ్‌గా
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా ప్రస్తుతం భారీ బడ్జెట్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొత్తం రూ.1600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది నిజమైతే, భారత సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్‌ను నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.
మొదటి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందని వార్తల సారాంశం. మొదటి భాగంలో రామాయణం లోకాన్ని సృష్టించేందుకు భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగిస్తుండటంతో బడ్జెట్ ఎక్కువగా ఉండగా, రెండో భాగంలో ప్రధానంగా యుద్ధ సన్నివేశాలు, క్లైమాక్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మార్చే లక్ష్యంతో బడ్జెట్‌పై రాజీపడడం లేదని నిర్మాతలు చెబుతున్నారు.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, దీన్ని 2026 దీపావళికి విడుదల చేయాలని, రెండో భాగాన్ని 2027 దీపావళికి తెరపైకి తీసుకురావాలనే యోచనలో ఉన్నారు.