పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హారర్, కామెడీ, యాక్షన్ మేళవింపుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌లో ప్రభాస్ తలకిందులుగా సింహాసనంపై కూర్చుని కనిపించిన షాకింగ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. “నేనొక రాక్షసుడిని” అనే ఆయన డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. “అతను మాంత్రికుడు కాదు, సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, ఎక్సార్సిస్ట్” అనే వాయిస్ ఓవర్ ఆయన పాత్రను ఆసక్తికరంగా మలిచింది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.
ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, తాజా అప్‌డేట్ ప్రకారం 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో ఒక ఫుల్ హారర్ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతోంది.