MI vs RCB: 3620 రోజుల తర్వాత ముంబైకి వడ్డీతో రిచ్చిపోయిన బెంగళూరు – మ్యాచ్ ఫలితం ఇదే!

ఐపీఎల్ 2025: వాంఖడేలో ముంబైపై బెంగళూరుకు ఉత్కంఠ విజయం – 10 ఏళ్ల తర్వాత గెలుపు!

ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన 20వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI)పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఇది వాంఖడే స్టేడియంలో 10 ఏళ్ల తర్వాత (3620 రోజుల తర్వాత) బెంగళూరుకు లభించిన గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో RCB పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

బెంగళూరు విధించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది.

 బెంగళూరు ఇన్నింగ్స్:

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.

  • విరాట్ కోహ్లీ – 67 పరుగులు

  • కెప్టెన్ రజత్ పాటిదార్ – 64 పరుగులు

  • జితేష్ శర్మ – అజేయంగా 40 పరుగులు

  • దేవదత్ పడిక్కల్ – 37 పరుగులు

ముంబై తరఫున:

  • ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా – చెరో 2 వికెట్లు

  • విఘ్నేష్ పుత్తూర్ – 1 వికెట్

ఇరు జట్ల ప్లేయింగ్ 11:

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్
ఇంపాక్ట్ ప్లేయర్: రోహిత్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ


Today's Best Deals

Rs. 270.00

Emoji Expressions Matching Game

Rs. 480.00

Labubu Bunny Keychain

Rs. 100.00

Face Changing Keychain

Rs. 230.00

Busy Book