‘కుబేర’ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ‘కుబేర’ సినిమా సక్సెస్ మీట్‌కు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ ఆడిటోరియంలోకి వచ్చిన వెంటనే చిత్ర బృందాన్ని పలకరించి, చిరంజీవిని చూసిన వెంటనే పాదాభివందనం చేస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ధనుష్ పాదాభివందనం చేస్తుండగా చిరంజీవి ఆయనను ఎత్తుతూ ఆలింగనం చేసి అభినందించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ హృదయానందకరమైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వారు కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ చిత్రంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 20న విడుదలై మంచి స్పందనను అందుకుంటోంది. అదే సందర్భంగా ఈ సక్సెస్ మీట్ జరిపారు.