Nari Shakti - Empowering Women

అందరిలానే మనం ఉంటాం,అందరిలో ఉంటాం కానీ అందరూ మెచ్చేలా మనమే ఉంటాం అనడానికి ఒక స్పూర్తి జ్యోతి గారు | Nari Shakti - Empowering Women | Mana Voice

అందరిలానే మనం ఉంటాం,అందరిలో ఉంటాం కానీ అందరూ మెచ్చేలా మనమే ఉంటాం  అనడానికి ఒక స్పూర్తి జ్యోతి గారు

ఆమె పేరు గుంటూరి జ్యోతి ప్రభందన,ఒక చిన్న పల్లెటూరు,చిన్నతనంలో చదువులోనూ ఆట,పాటలలో ముందువుండేవాళ్ళు,చిన్న చిన్న డ్రాయింగ్స్ వేస్తూ ఉండేవాళ్ళు,అలా డ్రాయింగ్ వేస్తూ వున్నప్పుడు ఆమె మనసులో ఒక తెలియని ప్రశాంతంగా,ఆనందంగా బావించేవారు,అందరూ చూసి మెచ్చుకునేవారు,స్కూల్ లో కూడా డ్రాయింగ్ పోటీలలో పాల్గొనేవారు,మొదటి బహుమతులు వచ్చేవి,అలా డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి శ్రద్ధగా ఉండేవాళ్ళు,అలా ప్రశాంతత కోసం సరదాగా వేసిన డ్రాయింగ్స్ ఇప్పుడు అవేలోకంగా మార్చుకున్నారు,కొన్ని రోజులు స్కూల్లో టీచర్ గా పని చేస్తూ జ్యోతిగారికి ఉన్న డ్రాయింగ్స్ ప్రతిభను పిల్లలకి బోధిస్తూ,అలవాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు,తర్వాత అలా కొన్ని సంవత్సరాలకు వివాహం అయింది,పెళ్లి పిల్లలు ఇంకా అదే లోకం అయిపోయింది మేడం గారు జీవితంలో,అలా కొన్ని రోజులకు సోషల్ మీడియా (ఫేస్బుక్)లో జాయిన్ అవ్వడం,
ఆ సమయంలోనే డ్రాయింగ్స్ వేస్తూ వాటిని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు,ఆ డ్రాయింగ్స్ నీ అందరూ సపోర్ట్ చేసి అభినందించే వాళ్ళు,అప్పుడు ఉత్సాహాన్ని నింపుకొని ఇంకా డ్రాయింగ్స్ వేస్తూ అలా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ  తనకి ఉన్న ప్రతిభను  మెరుగుపరుచుకున్నారు,అలా కొన్నాళ్ళకి  ఎక్కడికి వెళ్లిన మేడంగారు డ్రాయింగ్స్ గురించి మాట్లాడేవారు,పెళ్ళి అయిన తరువాత ఆడవాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోవాలా నాకు ఏమైనా గుర్తింపు కావాలి అని ఆలోచన మేదిలేది జ్యోతి గారికి.

కొంతమంది డ్రాయింగ్స్ గురువులను  కవలవడం, డ్రాయింగ్స్ లో వారి వద్ద తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటూ,ఆ తర్వాత స్కూల్స్ లో డ్రాయింగ్ టీచర్ గా జాయిన్ అయ్యారు.

ఒక రోజు అనుకోకుండా ఒక ఫేస్బుక్  గ్రూప్(Womens Group)లో జ్యోతి గారు వేసిన డ్రాయింగ్స్ పోస్ట్ చేయటంతో ఎన్నో వందల మంది అభినంనదిస్తు,వాళ్ల పిల్లలకు ఆన్లైన్ ద్వారా డ్రాయింగ్ చెప్పమని కోరడంతో,ఆన్లైన్ డ్రాయింగ్స్ క్లాసులు మొదలు పెట్టారు,మొదటిగా బ్యాచ్ 38పిల్లలతో మొదలు పెట్టారు,అలా కొన్ని రోజులకీ ఇంకా ఎక్కువ మందికి తెలియడంతో బ్యాచ్ 1 మొదలు అయిన కొన్ని రోజులలోనే 300మంది పేరెంట్స్ అడిగారు.
ఇతర దేశాలలో(USA, Canada, Malasia, Australia, UK, Ireland,) నివసించే మన తెలుగు వారు మాకోసం ఒక బ్యాచ్ పెట్టండి అని కోరడంతో ఇంకో బ్యాచ్ సార్ట్ చేసారు,మొదటి రెండు బ్యాచ్ లకి మంచి రెస్పాన్స్ రావటంతో పేరెంట్స్ కోరిక మేరకు ఇంకో బ్యాచ్ మొదలు పెట్టారు, మొదలు పెట్టిన 2 నెలలోనేలో 500 మందికి పైగా అడగటం విశేషం,కానీ కొంతమందికి టైమింగ్స్ ఏర్పాటు చేయలేకపోయేవాళ్ళు.ప్రస్తుతం 80 మంది పిల్లలకు ఆన్లైన్ డ్రాయింగ్ క్లాసులు చెప్తున్నారు,ఈ లక్ష్య సాధనలో తన వెంట కుటుంబం తోడుగా ఉంది.

జీవితంలో విజయం సాధించిన జ్యోతిగారు చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే,ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది,దానిని గుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి,ముఖ్యంగా ఆడవాళ్ళు అంత ఐపోయింది ఇక్కడే జీవితం ఆగిపోతుంది అనే భావం తొలగించి ఆగిన చోట నుంచే అడుగుల వేయడం మొదలు పెట్టండి తప్పకుండా విజయం సాధిస్తారు అని జ్యోతిగారి మాట.

జ్యోతిగారు వారి యొక్క విజయాన్ని అందరికీ తెలియ పరిచినందుకు Mana voice  pro కి ధన్యవాదములు తెలుపుకున్నారు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets