పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ పరీక్షలు వాయిదా
పాకిస్తాన్‌తో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అన్ని చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు మే 9 నుండి 14 వరకు జరగాల్సి ఉండేవి. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్షలు మే 3, 5, 7 తేదీలలో జరగాల్సి ఉండగా, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఐసీఏఐ నిర్ణయించింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నామని పేర్కొంది. పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.orgలో నోటీసును తనిఖీ చేయమని సూచించారు.