ఆదివారం, 25-05-2015 ఉదయం 9:00 గంటలకు
మీరు, మీ స్నేహితులు, బంధువులు, సంగీతాభిమానులు మరియు భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం.
ఈ శుభ సందర్భంలో "పంచముఖ మహా శివం" భక్తి పాటల ఆవిష్కరణ, చిన్నారుల భరతనాట్యం, ముఖ్య అతిథిగా డా. జె. కృష్ణ కిషోర్ గారు (ఇస్రో – ఇండియా) ప్రసంగం, డా. ఓలేటి పార్వతీశం గారి ప్రసంగం జరుగనున్నాయి.
పాటల ఆవిష్కరణను శ్రీమతి గౌరీ పద్మావతి గారు మరియు శ్రీ యాళ్ళ వరప్రసాద్ గారు నిర్వహించనున్నారు.
భక్తి గీతాలతో డా. వరుణ్ రాజు గారు మరియు ఉదయ్ కుమార్ గారు మనసులను హత్తుకుంటారు.
ఈ సందర్భంగా మహా శివుడి ప్రసాదం భక్తులందరికీ అందజేయబడుతుంది. ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు మీ కోసం.
ఈ ఆధ్యాత్మిక - సాంస్కృతిక వేడుకను మీరు గుర్తుంచుకుని, తప్పకుండా విచ్చేసి మమ్మల్ని గౌరవించగలరని ఆశిస్తున్నాము.
స్థలం: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్, తెలంగాణ
ధన్యవాదములతో,
డా. వరుణ్ రాజు, హైదరాబాద్