The day students and parents have been waiting for has arrived. The Telangana Intermediate Advanced Supplementary Exam Results are all set to be released.
The Intermediate Board has officially announced that the results will be released on Friday. Officials said that the results of the first year along with the second year will be released at 2 pm on Friday.
Officials said that students can check the results on the official website of the Inter Board as soon as the results are released. Meanwhile, the matter of conducting the Inter Advanced Supply Examinations from 12th to 20th June is mandatory.
Supplementary examinations were conducted in a total of 933 examination centers across Telangana. A total of 4,12,325 people appeared for the examination in the first year and second year. Also the practicals were conducted from 5th to 9th June.
Telugu version
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
శుక్రవారం ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ద్వితీయ సంవత్సరంతోపాటు ప్రథమ సంవత్సరం ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫలితాలు వెలువడిన వెంటనే ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లై పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 933 పరీక్షా కేంద్రాల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,12,325 మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు.