పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.
"భారత జలాలు ఇకపై దేశ ప్రయోజనాలకే వినియోగించబడతాయి. అవి వెలుపలికి వెళ్లడం ఇకపై జరగదు. మన జలాలు – మన హక్కు," అని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కొన్ని నదీజలాలు భారత్ వెలుపలికి వెళ్లినప్పటికీ, ఇకపై వాటిని పూర్తి స్థాయిలో దేశ అవసరాలకే వినియోగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ప్రస్తుతం చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ నుండి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడంపై చర్యలు ప్రారంభమయ్యాయి. అలాగే, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుండి నీటి విడుదలను తగ్గించే దిశగా కూడా ప్రణాళికలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు.