National

విరాట్ కోహ్లీపై శింబు కామెంట్: "నువ్వు నిజంగా సింహానివి"

ఎప్పుడూ ఎనర్జీతో కనిపించే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా పాటలు వింటూ రిలాక్స్ అవుతాడు. ప్రాక్టీస్ లేని సమయంలో అతను హెడ్‌ఫోన్లు లేదా బ్లూటూత్ ద్వారా సాంగ్స్ వినడం సాధారణమే. ఢిల్లీకి చెందిన కోహ్లీకి బాలీవుడ్ పాటలే ఇష్టమని చాలామందికి భావన. కానీ ఆయనకు దక్షిణాది సంగీతం పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉండడం విశేషం.

తాజాగా ఓ లైవ్ ఇంటరాక్షన్‌లో, తన ఫేవరెట్ సాంగ్ ఏంటని అడిగిన ప్రశ్నకు కోహ్లీ తాను ప్రస్తుతం లూప్‌లో వింటున్న తమిళ్ పాటను మిగిలినవారికి వినిపించాడు. ఇది హీరో శింబు నటించిన ‘పాథా థాలా’ సినిమాలోని ‘నీ సింగం ధాన్’ పాట. కోహ్లీ ఈ పాటను తన “మోస్ట్ ఫేవరెట్” సాంగ్‌గా పేర్కొన్నాడు. ఆ వీడియోను ఆర్‌సీబీ (RCB) తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది.

ఈ వీడియోపై హీరో శింబు స్పందిస్తూ “నువ్వు నిజంగా సింహానివి” అనే క్యాప్షన్‌తో ఆ వీడియోను తన ఖాతాలో రీషేర్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కోహ్లీ అభిమానులు కూడా ఈ మ్యాజికల్ కాంబినేషన్‌పై తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, కోహ్లీ బయోపిక్‌పై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, ఈ బయోపిక్‌లో కోహ్లీ పాత్రలో శింబు నటించనున్నాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా శింబు, కోహ్లీ మాదిరిగానే గడ్డం పెంచడంతో ఈ వార్తలకూ బలం చేకూరింది. మరోవైపు, కోహ్లీ పాత్రలో నటించాలన్న ఆసక్తిని బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ గతంలోనే వ్యక్తపరిచాడు.

ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ 2025 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో అలరిస్తున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 443 పరుగులు చేసి, వరుస హాఫ్ సెంచరీలతో ‘రన్ మెషీన్’ తన సత్తా చాటుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఐదో స్థానంలో ఉన్నాడు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens