ముంబైలో వేవ్స్ 2025 సదస్సు ప్రారంభం – ప్రత్యేక ఆకర్షణగా రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్
ముంబై జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సదస్సు (WAVES) 2025 గురువారం ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మరియు మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇది నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
ఈ సమ్మిట్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్టాల్‌ను సందర్శిస్తున్న ప్రతినిధులకు, సందర్శకులకు CMD CH కిరణ్ స్వయంగా వివరాలు అందిస్తున్నారు. ETV CEO బాపినీడు, ఉషాకిరణ్ మూవీస్ నుండి ఏవీ రావు, కె. రవీంద్రరావు కూడా ఆయనతో ఉన్నారు.
రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఇక్కడ 3,500కి పైగా సినిమాలు తీయబడ్డాయి. ఆర్ఆర్ఆర్, బాహుబలి, కల్కి, పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలు ఇక్కడే రూపొందాయి. భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వేదికను రూపొందించింది. గురువారం ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాజమౌళి, అల్లు అర్జున్, నాగచైతన్య, శోభిత వంటి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.