orts

భారతదేశంలో టెన్నిస్ క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు డ్రీమ్ లీగ్ ఆఫ్ ఇండియా ప్రారంభం

న్యూఢిల్లీ, మే 1: దేశ రాజధానిలో గురువారం ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో డ్రీమ్ లీగ్ ఆఫ్ ఇండియా (DLI) ను సర్వోటెక్ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్‌లో జూనియర్స్ (13–18 సంవత్సరాలు) మరియు సీనియర్స్ (18 పైబడినవారు) రెండు విభాగాల్లో ఆరు ఫ్రాంచైజీలు పోటీపడతాయి.

బాలీవుడ్ నటుడు సోను సూద్ లీగ్ కమిషనర్‌గా నియమించబడ్డారు. ప్రముఖ సంగీత దర్శకుడు మరియు గాయకుడు సలీమ్ మర్చంట్ ఈ లీగ్‌కు సెలబ్రిటీ అంబాసడర్‌లలో ఒకరిగా చేర్చబడ్డారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే డ్రీమ్ లీగ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ టెన్నిస్ క్రికెట్ సమాఖ్య (ITCF) మరియు టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TCAI) ఆధ్వర్యంలో భారత్ తరఫున ఆడే అవకాశాన్ని పొందగలుగుతారు.

ఆసక్తి ఉన్న ఆటగాళ్లు లీగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా Starzpit యాప్ ద్వారా నమోదుకావచ్చు. దేశవ్యాప్తంగా 1,500 మందికి పైగా అర్హత కలిగిన కోచ్‌ల పర్యవేక్షణలో జిల్లాల వారీగా ట్రయల్స్ నిర్వహించబడతాయి.

ఈ ట్రయల్స్ ద్వారా 860 మంది జూనియర్లు మరియు 860 మంది సీనియర్లు DLI ఆటగాళ్ల వేలం కోసం ఎంపిక కాబడతారు. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఇంటర్-జోనల్ టోర్నమెంట్ లో పాల్గొంటారు. జోన్ విజేతలు ఆల్-జోనల్ ఛాంపియన్‌షిప్ కు అర్హత సాధిస్తారు. ఆ పోటీ విజేతలు, సీజన్ 1 లో గెలిచిన ఫ్రాంచైజీ జట్టుతో సీజన్ 2 ఓపెనర్లో తలపడతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశముంటుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens