భారత సాయుధ దళాలు విజయవంతంగా అమలు చేసిన "ఆపరేషన్ సిందూర్" పాకిస్థాన్‌కి గట్టిన దెబ్బ తగిలింది. ఈ ఆపరేషన్ విజయాన్ని మూసిపెట్టేందుకు, పాకిస్థాన్ ఇప్పుడు డిజిటల్ వేదికలపై తప్పుడు ప్రచార యుద్ధంను ముమ్మరంగా నిర్వహిస్తోంది.
వాస్తవాలను వక్రీకరిస్తూ, పాత వీడియోలు, ఫోటోలతో కల్పిత కథనాలు ప్రచారం చేస్తూ, ప్రజల్లో సందిగ్ధత సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలుతో పాటు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ అసత్య ప్రచారంలో పాల్గొనడం గమనార్హం.
ఉదాహరణకు:
భారత రఫేల్ జెట్‌ను బహావల్పూర్ సమీపంలో కూల్చేశామని వారు ప్రచారం చేసిన చిత్రం, 2021లో పంజాబ్‌లో మోగా వద్ద కూలిపోయిన మిగ్-21కి సంబంధించినదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టంచేసింది.
చోరా పోస్ట్ వద్ద భారత సైన్యం తెల్లజెండా ఊపిందని పేర్కొంటూ నకిలీ వీడియోను పాక్ మంత్రి అతావుల్లా తరార్ ప్రచారం చేయడం జరిగింది.
శ్రీనగర్ వైమానిక స్థావరంపై దాడి చేశామని ప్రచారం చేస్తున్న వీడియో కూడా నకిలీదే; అది అసలు 2024లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరిగిన సంఘటనకు సంబంధించినది.
భారత బ్రిగేడ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని, భారత సైనికులను బంధించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని తేలడంతో, ఆయనే స్వయంగా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
ఈ దుష్ప్రచార యత్నాల వెనుక అసలైన ఉద్దేశం – "ఆపరేషన్ సిందూర్" విజయాన్ని మర్చిపోయేలా చేయడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం. భారత రక్షణ వర్గాల అంచనాల ప్రకారం, ఇది అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం.