తెలంగాణ టెట్ (TET 2025) దరఖాస్తు గడువు ఏప్రిల్ 30 అర్ధరాత్రితో ముగిసింది. మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. మొదట 1.5 లక్షలకు మించి దరఖాస్తులు రావని భావించినా, చివరి 30 గంటల్లో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రెండు గంటల్లోనే 18,492 దరఖాస్తులు వచ్చాయి.
పేపర్ 1కి 63,261 మంది, పేపర్ 2కి 1,20,392 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 15 వేల మంది రెండు పేపర్లకూ దరఖాస్తు చేశారు. 2025 జనవరిలో జరిగిన టెట్‌తో పోల్చితే ఈసారి 92,122 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. ఇప్పటికే పని చేస్తున్న SG టీచర్లలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం మళ్లీ టెట్ రాశారు.
జూన్ 15 నుంచి 30 వరకు టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. మరోవైపు, ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీ మే 4న విడుదల కానుంది. అభ్యంతరాలు మే 6వ తేదీ లోగా సమర్పించవచ్చు.