ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన అనేక ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఆ కార్యక్రమంలో ప్రఖ్యాత నటి పూనం కౌర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక ప్రత్యేక బహుమతి అందజేశారు. ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అందులో ఆ బహుమతి అమరావతికి ప్రతీకగా రూపొందించిన పటచిత్ర కళాకృతి అని చెప్పుకొచ్చారు. బహుమతి అందజేసే క్షణంలో తీసుకున్న ఫొటోను కూడా పంచుకున్నారు.
పూనం కౌర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తన అభిమానుల నుండి మంచి స్పందనను పొందింది.