Andhra Pradesh

పవన్ కళ్యాణ్: "సింహాచలం సంఘటన దురదృష్టకరం" డిప్యూటీ సీఎం పవన్

పవన్ కళ్యాణ్ సింహాచలం ఘట్నపై దిగ్భ్రాంతి

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమని పేర్కొన్న పవన్, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పవన్ కళ్యాణ్ బాధితుల‌కు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అందరు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కోరారు. అనంతరం, ఈ ఘట్నపై అధికారులను అడిగి తెలుసుకున్న పవన్, హోంమంత్రి అనిత సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

కాగా, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేశామని ఆయన తెలిపారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens