కాకినాడలో చంద్రబాబుకు మత్స్యకారుల కృతజ్ఞతా బోటు ర్యాలీ
వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా మొత్తాన్ని రూ.20,000కు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాకినాడలో మత్స్యకారులు బోటు ర్యాలీ నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జెండాలతో బోట్లను అలంకరించి, మత్స్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నేతృత్వం వహించారు. ఏటి మొగ్గ నుంచి జగన్నాథపురం వంతెన దాకా బోటుల ప్రదర్శన జరిగింది. వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయాన్ని పెంచినందుకు మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, చంద్రబాబు మాత్రమే మత్స్యకారులకు బీమా, వలలు, బోట్లు, ఇంజిన్లు అందిస్తూ నిజమైన మద్దతు కల్పించారని చెప్పారు. “థాంక్యూ సీఎం సార్” అంటూ మత్స్యకారులు కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమన్నారు.