Sports

6 wickets for 11 runs.. 88 runs lead.. Spin magic in indoor..

Australia's first innings of the indoor Test is over. The Aussie team was bowled out for 197 runs in the first innings. So they got a lead of 88 runs over India. It is known that India could score only 109 runs in its first innings. The Aussies, who finished the first day at 156 for the loss of 4 wickets, added 41 runs on the second day and lost the last 6 wickets.

On the first day, Ravindra Jadeja alone took 4 wickets against Australia. On the second day, Ashwin and Umesh Yadav combined to thrash the Kangaroos. Both of them took three wickets together. First Ashwin dismissed Peter Handscomb and then Umesh Yadav LBW to Cameron Green. Later, Mitchell Starc was bowled by Umesh Yadav.
 
Ashwin added Alex Carey with an lbw. Also, the last two wickets are also shared by these two bowlers. On the other hand, in the indoor Test, Australia was bowled out for 197 runs and took a lead of 88 runs. With this, if India gives Australia a target of at least 250 runs in the second innings, victory is definitely ours.

Telugu version

ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్‌పై 88 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు మాత్రమే చేయగలిగిన విషయం తెలిసిందే. ఇక తొలి రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 156 పరుగులకు ముగించిన ఆసీస్.. రెండో రోజు 41 పరుగులు జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది.

తొలిరోజు రవీంద్ర జడేజా ఒక్కడే ఆస్ట్రేలియాపై 4 వికెట్లు తీయగా.. రెండో రోజు అశ్విన్, ఉమేష్ యాదవ్ కలిసి కంగారూలను బెంబేలెత్తించారు. ఆ ఇద్దరూ కలిసి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మొదట అశ్విన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను, ఆ తర్వాత ఉమేష్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా కామెరూన్ గ్రీన్‌ను ఔట్ చేశారు. అనంతరం మిచెల్ స్టార్క్‌ను ఉమేష్ యాదవ్ బౌల్డ్ చేయగా.. అశ్విన్ ఎల్బీడబ్ల్యూతో అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చాడు. అలాగే చివరి రెండు వికెట్లను సైతం ఈ ఇద్దరు బౌలర్లు పంచుకోవడం విశేషం. మరోవైపు ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయి.. 88 పరుగుల ఆధిక్యం సాధించింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇస్తే.. కచ్చితంగా విజయం మనదే.


 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets