యూపీఐ చెల్లింపులు మరింత వేగవంతం: NPCI కీలక మార్పులు ప్రకటించింది
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలను పూర్తిచేయడానికి కనీసం 30 సెకన్ల సమయం పడుతుంది. దీనిని తగ్గించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్పులను చేయనుంది. 2025 జూన్ 16 నుండి యూపీఐ లావాదేవీలు 15 సెకన్ల వ్యవధిలోనే పూర్తి అవుతాయి.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు, ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు, వినియోగదారులు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు అన్నీ నగదు రహిత లావాదేవీలుగా యూపీఐని ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ లావాదేవీలకు తీసుకునే సమయం ఒక సమస్యగా మారింది. దీన్ని తగినంత తగ్గించాలని NPCI నిర్ణయించింది.
ఈ తాజా అప్‌డేట్ జూన్ 16 నుండి అమలులోకి రానుంది. దీని ద్వారా యూపీఐ లావాదేవీలు మరింత వేగవంతం మరియు సులభతరం అవుతాయి. లావాదేవీ నిర్ధారణ సమయం 30 సెకన్ల నుండి 10 సెకన్ల కు తగ్గించబడుతుంది. దీనివల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుంది.